అంతర్జాతీయ విద్యాసంస్థలతో ఒప్పందం.. ఇంజనీరింగ్ లో సరికొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశపెట్టిన హితమ్



ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు దీటుగా, ఉద్యోగం సంపాదించే నైపుణ్యం పెంపొందించేలా సరికొత్త ఇంటిగ్రేటెడ్ కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్. అంతర్జాతీయ 3+1+1 ఇంటిగ్రేటెడ్ కోర్సును తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు భారతదేశంలోని హితమ్ కళాశాలలో మూడేళ్లపాటు చదువుకోవచ్చు.